హై-స్పీడ్ కార్ క్రాష్ ప్రమాదం నుండి తప్పించుకున్న అజిత్ కుమార్…

హై-స్పీడ్ కార్ క్రాష్ ప్రమాదం నుండి తప్పించుకున్న అజిత్ కుమార్…

పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ కుమార్ డ్యూయల్ కార్ క్రాష్‌ ప్రమాదం నుండి బయటపడ్డాడు. తన కారు డ్యూయల్ క్రాష్‌లో చిక్కుకున్న తర్వాత తమిళ హీరో అజిత్ కుమార్ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డాడు. క్రాష్ తర్వాత అతని కారు రెండుసార్లు పల్టీలు కొట్టినప్పటికీ, హీరో “బాగా సేవ్ అయ్యాడు” అని హీరో సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అతను రేసును 14వ స్థానంతో ముగించాడు. తనకు బాగా రక్షణ ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని అజిత్ తన సహచరులకు భరోసా ఇచ్చారని ఆ వర్గాలు IANSకి తెలిపాయి. అజిత్ క్రాష్‌ల గురించి చెబుతూ రేసింగ్‌లో అది ఒక భాగమని, క్రాష్‌లను లైట్‌గా తీసుకున్నట్లు తెలిపిన హీరో. స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన ఈవెంట్ నుండి ఇటీవలి వీడియో, అజిత్ కారు మరొక రేసర్‌ను వెనుకకు తిప్పడం, కంకరపై ఆపే ముందు చాలాసార్లు పల్టీలు కొట్టడం మనకు వీడియోలో కనబడింది. క్రాష్ వీడియోను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఎక్స్‌లో షేర్ చేశారు.

editor

Related Articles