‘3 ఇడియట్స్’ నటుడు అచ్యుత్ పోట్దార్ కన్నుమూత

‘3 ఇడియట్స్’ నటుడు అచ్యుత్ పోట్దార్ కన్నుమూత

సినీ ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ర‌ణ వార్త‌ల‌తో విషాదంలోకి వెళ్లిన భారతీయ చలనచిత్ర పరిశ్రమకి మరో షాక్ తగిలింది. ‘3 ఇడియట్స్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ న‌టుడు అచ్యుత్ పోట్దార్ (91) మంగ‌ళ‌వారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని థానేలో ఉన్న జుపిటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇక అచ్యుత్ పోట్దార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

editor

Related Articles