తెలుగు సినిమా హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నిర్మాత నాగవంశీ. ఆయన మాట్లాడుతూ.. వీడీ12 ప్రాజెక్ట్ రెండు పార్టులుగా రాబోతుందని ప్రకటించాడు. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. అయితే ఈ రెండు పార్టులలో రెండు వేరు వేరు కథలు ఉంటాయని నాగవంశీ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ ఆ టైంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ తేదీ ఉంటే తమ సినిమాను వాయిదా వేయనునట్లు చెప్పుకొచ్చాడు.

- December 27, 2024
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor