టాలీవుడ్ తాజా సినిమా డ్యూడ్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌ను నేడు నిర్వహించగా.. ఈ వేడుకలో సుకుమార్ – రామ్ చరణ్ సినిమా గురించి అప్‌డేట్‌ను షేర్ చేసింది చిత్రబృందం. మైత్రీ బ్యానర్‌లో సుకుమార్‌తో వచ్చే తదుపరి సినిమా ఏంటి అని మీడియా అడుగగా.. మైత్రీ నిర్మాతలు స్పందిస్తూ.. పుష్ప 3 కంటే ముందు సుకుమార్ – రామ్ చరణ్ సినిమా రాబోతోందని తెలిపింది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అనంతరం రామ్ చరణ్ డేట్స్ చూసుకొని సుకుమార్ – రామ్ చరణ్ ‘సుక్కు’ సినిమా స్టార్ట్ చేయబోతున్నామని అంటూ మైత్రీ మూవీస్ చెప్పుకొచ్చింది.

- October 18, 2025
0
47
Less than a minute
You can share this post!
editor