రతిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘ఎక్స్ వై’. శ్రీ క్రిష్ బ్యానర్‌పై ఎం కె సాంబశివం నిర్మిస్తున్నారు. పిజ్జా, సూదు కవ్వుమ్, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్ లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసిన దర్శక నిర్మాత సి.వి. కుమార్ ఇప్పుడు ‘ఎక్స్ వై’ అంటూ మరో ప్రయోగాత్మక సినిమాతో రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కథ ఏంటి? బ్యాక్ డ్రాప్ ఏంటి? అన్న విషయాల్ని రివీల్ చేయకుండా ఇదొక ప్రయోగాత్మక సినిమా అని పోస్టర్ ద్వారా తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో కనిపించిన టీ పోసే బౌల్, కెమెరా, మెదడు, డీఎన్ఏ, ఆ తరువాత రాక్షసుడిలా ఓ రూపాన్ని చూపించడం, ఆపై హీరోయిన్ లుక్ చూపించడం, అక్కడ చుట్టూ గర్భంలో ఉన్న శిశువుల్ని చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ సినిమా అని అర్థమవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.
- October 24, 2025
0
36
Less than a minute
You can share this post!
editor

