పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ట్రాఫిక్ డైవర్షన్..

పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ట్రాఫిక్ డైవర్షన్..

పుష్ప ది రూల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఈరోజు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ వల్ల భారీగా అభిమానులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ నియంత్రణకు అటుగా వెళ్లాల్సిన వాళ్లని డైవర్ట్ చేస్తూ పోలీసులు పలు మార్గాలను సూచించారు.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ముఖ్యంగా నాలుగు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్స్‌న్స్ చేస్తున్నారు. 

  • మైత్రీవనం జంక్షన్ నుంచి బోరబండ బస్ స్టాప్ వైపు వచ్చే ట్రాఫిక్ సవేరా ఫంక్షన్ హాల్- కృష్ణకాంత్ పార్క్- కళ్యాణ్ నగర్- మోతీ నగర్- బోరబండ బస్ స్టాప్ వద్ద మళ్లిస్తున్నారు
  • బోరబండ బస్టాప్ నుంచి వచ్చే ట్రాఫిక్, మైత్రీవనం జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు ప్రైమ్ గార్డెన్ కళ్యాణ్ నగర్- మిడ్‌ల్యాండ్ బేకరీ- GTS కాలనీ- కళ్యాణ్ నగర్ జంక్షన్- ఉమేష్ చంద్ర విగ్రహం యూ టర్న్ జంక్షన్ వద్ద మళ్లిస్తున్నారు. 
  • మైత్రీవనం జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్ వైపు వెళ్లే ట్రాఫిక్ యూసుఫ్‌గూడ బస్తీ వద్ద RBI క్వార్టర్స్-కృష్ణానగర్ జంక్షన్-జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లిస్తారు
  • జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కోట్ల విజయ భాస్కర్ స్టేడియం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కృష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.

ఈవెంట్ కోసం వచ్చే వారి కోసం జానకమ్మతోట, సవేరా ఫంక్షన్ హాల్, మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో తమ వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు.

editor

Related Articles