ఛ.ఛ.. అలాంటిదేం లేదు..క్లారిటీ

ఛ.ఛ.. అలాంటిదేం లేదు..క్లారిటీ

ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన రోజే ఆయన అసిస్టెంట్ మోహిని దే కూడా విడాకులు ప్రకటించడంతో మీడియాలో అనేక సందేహాలు, చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో రహమాన్ భార్య సైరాభాను తరపు లాయర్ వందనా షా క్లారిటీ ఇచ్చారు. అలాంటి పుకార్లలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. విడాకులు తీసుకోవడం అనేది వారిద్దరి పరస్పర అంగీకారంతో జరిగిందని, ఇది ఎంతో బాధతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. ఇది సెలబ్రేట్ చేసుకునే విషయం కాదన్నారు. వారి కారణాలు వారికుంటాయి. వారిద్దరూ కలిసి ఉన్నా, లేకపోయినా ఉన్నతంగా జీవించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. రహమాన్ కూడా తమ బంధం 30 ఏళ్లకు చేరువలో వచ్చి విడిపోవడంపై బాధను వ్యక్తం చేశారు. ఇలాంటి కఠిన పరిస్థితులలో తమ వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు.

editor

Related Articles