కల్కి 2 మేకర్స్ నుండి దీపికకు డబుల్ రెమ్యూనరేషన్, బృందానికి విలాసవంతమైన ట్రీట్మెంట్ కావాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. ప్రభాస్ కల్కి 2 లో దీపికా పదుకొణె పూర్తిగా సినిమా నుండి తప్పుకుంది. ఆమెకు ఇకపై ఈ సినిమాతో సంబంధం లేదని చిత్ర నిర్మాతలు గురువారం ధృవీకరించారు. కల్కి 2 నుండి దీపికా పదుకొణె తొలగింపు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హీరోయిన్ దీపిక, ప్రభాస్ హీరోగా నటించిన సినిమా నిర్మాతల మధ్య సరిగ్గా ఏమి జరిగిందో పేర్కొంటూ అనేక పత్రికలు నివేదికల రూపంలో పేర్కొన్నాయి. వీటన్నింటి మధ్య, దీపికా పదుకొణె అధిక పారితోషికం, తక్కువ పనిగంటలు డిమాండ్ చేయడం వల్లే ఆమె సీక్వెల్ నుండి తొలగించారు. తెలుగు న్యూస్ ఒక పోర్టల్ ప్రకారం, దీపికా పదుకొణె కల్కి 2 నిర్మాతలను తన పారితోషికాన్ని ఫస్ట్ పార్ట్ కంటే రెట్టింపు చేయాలని కోరింది. ఫీజు పెంపు శాతం చాలా ఎక్కువగా ఉందని, దాని గురించి తెలుసుకున్నప్పుడు వారి “కళ్ళు తిరిగాయి” అని ఒక పత్రికలో ప్రచురించ బడింది. దీనితో పాటు, దీపికా పదుకొణె షూటింగ్ సమయంలో తన బృందానికి విలాసవంతమైన ట్రీట్ మెంట్ ను కోరిందని కూడా ఆ కథనం పేర్కొంది. ఆమె రోజుకు ఐదు గంటల పని మాత్రమే చేయడానికి షిప్ట్ కు కట్టుబడి పనిచేస్తానని కూడా చెప్పింది. మరో పత్రికలో కల్కి 2 నిర్మాతలు దీపిక తన ఫీజులో 25 శాతం పెంపుదల, 7 గంటలు పని మాత్రమే ఉండేలా షిప్ట్ ను డిమాండ్ చేస్తున్నందున ఆమెను తొలగించారు. నివేదిక ప్రకారం, ఈ రెండు డిమాండ్లను మేకర్స్ హీరోయిన్ తో చర్చించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె ఏమాత్రం నిర్మాతల నిబంధలను ఒప్పుకోలేదు. అదే నివేదికలో తనతో పాటు దీపిక 25 మంది వస్తారని కూడా పేర్కొంది. నటి తన బృందం కోసం ఐదు నక్షత్రాల వసతి, ఆహారం కోసం తిరిగి చెల్లింపు బిల్స్ ను కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. నిర్మాతలు ఆమెతో చర్చలు జరిపి మీ టీమ్ లో కొంతమందిని తగ్గించుకోమని ఆమెను అభ్యర్థించగా, దీపిక తన డిమాండ్లను ఏమాత్రం తగ్గించుకోనని తెలిపింది. దీంతో ఈమెను భరించడం కష్టం (ఈమె వైట్ ఎలిఫెంట్) అని నిర్మాతలు దీపికను తొలగించారు.

- September 19, 2025
0
4
Less than a minute
You can share this post!
editor