అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్​ హీరో..

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్​ హీరో..

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అరెస్ట్ అయితే సంగతి తెలిసిందే. ‘బేబీ జాన్‌’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్​ హీరో వరుణ్ ధావన్ జైపుర్‌లో జరిగిన ఈవెంట్‌లో మాట్లాడుతూ, ” భద్రతా పరమైన, ఇతర అంశాలను నటీ నటులు ఒక్కరే చూసుకోలేరు. జాగ్రత్తగా ఉండమని మాత్రమే ప్రజలకు చెప్పగలం. ఏదైతే ఈరోజు జరిగిందో అది బాధాకరం. ఈ ఘటనపై సానుభూతి తెలుపుతున్నాను. ఒక వ్యక్తినే నిందించడం కరెక్ట్ కాదు.” అని అన్నారు.

అసలేం ఏం జరిగిందంటే?

డిసెంబరు 5న అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2: ది రూల్‌. ఈ నేపథ్యంలో డిసెంబరు 4న (బుధవారం) ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్​లో ప్రీమియర్‌ షోలు ప్రదర్శించారు.

అక్కడికి అల్లు అర్జున్ రాకతో థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగి దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి,ఆమె కుమారుడు తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడక రేవతి అక్కడే మృతి చెందగా, కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్‌ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

editor

Related Articles