నాటి అందాల న‌టి స‌రోజా దేవి కన్నుమూత‌

నాటి అందాల న‌టి స‌రోజా దేవి కన్నుమూత‌

కోట శ్రీనివాస రావు మ‌ర‌ణ వార్త మ‌రిచిపోక ముందే ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి బీ సరోజా దేవి వ‌యోభారంతో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యంలో వ‌చ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరు, యశవంతపురలోని మణిపాల్ ఆస్పత్రిలో ఆమెకి చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే (87) సోమవారం కన్నుమూశారు. ఆమె మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.

చిటపట చినుకులు పడుతూ ఉంటే

చెలికాడె సరసన ఉంటే.

చెట్టాపట్టగ చేతులు పట్టి

చెట్టు నీడకై పరుగిడుతుంటే… చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ – ఈ పాటతో మహానటిగా చరిత్రలో చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతుంది స‌రోజా దేవి గారు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మన సర్కార్ పేపర్ ఛైర్మన్ ఆరా మస్తాన్ గారు, సిబ్బంది నివాళులు అర్పించారు.

editor

Related Articles