నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమాలు, షోస్‌తోనే కాకుండా వివాదాలతోను వార్తలలో నిలుస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా ఆమెకు విశేషమైన గుర్తింపు ఉంది. అంతేకాదు, గ్లామర్ పరంగా కూడా అనసూయకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై జరిగే చర్చలు రోజూ ఏదో ఒకదాంట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన “రంగమ్మత్త” పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ పాత్ర కోసం తొలుత నటి రాశికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఆమె తిరస్కరించడంతో అనసూయకి ఆ ఛాన్స్ దక్కింది. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. అయితే అనసూయపై సోషల్ మీడియాలో, యూట్యూబ్ చానళ్లలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి విమర్శలు ఎక్కువయ్యాయి. దీని గురించి మాట్లాడిన అనసూయ.. “కొంతమంది మహిళలే నన్ను టార్గెట్ చేస్తున్నారు. వాళ్లతో నాకు ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేదు, అయినా నా వ్యక్తిత్వంపై విమర్శలు చేస్తున్నారు” అని తెలిపారు.

- July 31, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor