ఆది పినిశెట్టి, కోలీవుడ్ దర్శకుడు అరివళగన్ కాంబినేషన్‌లో రాబోతున్న తాజా సినిమా ‘శబ్దం’. నటుడు ఆది పినిశెట్టి, కోలీవుడ్ దర్శకుడు అరివళగన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్‌లో రాబోతున్న తాజా సినిమా ‘శబ్దం’. 15 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఈరం (తెలుగులో ‘వైశాలి’) తర్వాత మళ్లీ ఈ ముగ్గురి కాంబోలో ‘శబ్దం’ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో లక్ష్మీమీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరివళగన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించగా.. ఈ వేడుకకు నాని ముఖ్య అతిథిగా వచ్చి చిత్రబృందానికి సినిమా విజయవంతం అవ్వాలని శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమా ఈవెంట్‌లో ఆది మాట్లాడుతూ.. వైశాలి లేకుంటే శబ్దం సినిమా ఉండేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శబ్దం సినిమా ప్రయాణం 16 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యింది. ‘వైశాలి’ అనే సినిమా వలన ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. వైశాలి లేకుంటే ఈరోజు శబ్దం సినిమా కూడా ఉండేది కాదు. ఈ విషయంలో మా దర్శకుడికి ధన్యవాదాలు తెలపాలి. వైశాలి ఇప్పుడు చూసినా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. మనం కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే ఈ సినిమాకి కథనే బలం అంత నిజాయితీతో తీశాం. ఇప్పుడు అంతే నిజాయితీతో శబ్దం సినిమా తెరకెక్కించాం. నా కెరీర్‌లో ఈ సినిమా చాలా స్పెషల్‌గా నిలిచిపోతుందంటూ ఆది చెప్పుకొచ్చాడు. శబ్దం సినిమా కథ విషయానికి వస్తే.. హర్రర్ – థ్రిల్లర్‌గా రాబోతోంది. ఇందులో శబ్దాలు (సౌండ్) కథలో కీలక పాత్ర పోషించనుండగా.. ఆది పినిశెట్టి ఇందులో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడు శబ్దాలకు అతీంద్రియ శక్తులతో ఉన్న సంబంధం ఏంటి అనే రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇందులో కథానాయికగా నటిస్తున్న లక్ష్మీ మీనన్ పాత్ర ఒక వింతైన శబ్దాల అనుభవంతో బాధపడుతూ, ఆ రహస్యానికి కేంద్ర బిందువుగా ఉంటుంది.

- February 22, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor