‘ఇడ్లీకడై’తో  షాలినికి  అదృష్టం  మారనుందా..

‘ఇడ్లీకడై’తో  షాలినికి  అదృష్టం  మారనుందా..

‘అర్జున్‌రెడ్డి’  సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది జబల్‌పూర్‌ హీరోయిన్ షాలినీ పాండే. ఆ తర్వాత ‘మహానటి’తో సుశీల పాత్రతోనూ మెప్పించింది. తదుపరి వచ్చిన తెలుగు, హిందీ బాషల్లో వచ్చిన ఏ సినిమా ఆమెకు విజయాన్ని అందించలేదు. ఆమె నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నప్పటికీ ఆమెకు సరైన బ్రేక్‌ లభించలేదు. తమిళంలో వచ్చిన  ‘100 శాతం కాదల్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టింది. అయితే, ఆమె నటనా ప్రతిభను గుర్తించిన దర్శక నటుడు ధనుష్‌… తన స్వీయ నిర్మాణంలో రూపొందించిన ‘ఇడ్లీకడై’లో మరోమారు అవకాశం ఇచ్చారు. ఇందులో మరో ముఖ్య పాత్ర పోషించిన అరుణ్‌ విజయ్‌కు జోడీగా షాలిని పాండే నటించారు. దీంతో కోలీవుడ్‌లో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుతం ఆమె హిట్టు  కోసం  ఈ సినిమా మీదే గంపెడాశలు పెట్టుకుంది. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో షాలినీ హిట్టు కొట్టే ఛాన్స్ ఉంది.

editor

Related Articles