ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి హంగామా మొదలైంది. తన చెల్లి శ్రుతిప్రియ పెళ్లి వేడుకలకి సంబంధించిన అన్ని పనులని స్వయంగా మధుప్రియే చూసుకుంటూ, కుటుంబంలో ఆనందాన్ని నింపుతోంది. ఇటీవలే చెల్లి నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించిన మధుప్రియ.. ఇప్పుడు పెళ్లి పనుల్లో కూడా బిజీ అయిపోయింది. ఆగస్ట్ 5న ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో చెల్లితో కలిసి మధుప్రియ తీన్మార్ స్టెప్పులతో అందరినీ అలరించింది. ఆ సందర్భంలో తీసిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. “మా చెల్లి పెళ్లి కూతురయ్యింది!” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మధుప్రియ చెల్లికి ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నారు.

- August 6, 2025
0
127
Less than a minute
Tags:
You can share this post!
editor