‘వార్ 2’ ట్రైల‌ర్ అప్‌డేట్స్…

‘వార్ 2’ ట్రైల‌ర్ అప్‌డేట్స్…

 బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘వార్ 2’. య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య‌చోప్రా నిర్మిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో సినిమా ప్ర‌మోష‌న్స్ చిత్ర‌యూనిట్ షురూ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ట్రైల‌ర్ అప్‌డేట్‌ను షేర్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమా ట్రైల‌ర్‌ను జూలై 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌కటించారు. దాదాపు 2 నిమిషాల 39 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌ ఉంటుంది. ఇది YRF స్పై యూనివర్స్‌లో ఆరో సినిమా. హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కీలక పాత్రలో యాక్టింగ్ చేస్తోంది. 

editor

Related Articles