‘వార్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

‘వార్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న వార్ 2 సినిమా మ‌రో నాలుగు రోజుల్లో (ఆగస్ట్  14న) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌లు నేటి నుండి ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌ముఖ బుకింగ్ వెబ్‌సైట్స్ బుక్ మై షోల‌తో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌ల‌లో ఈ సినిమా టికెట్‌లు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. హిందీ వెర్షన్‌లో ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 53 నిమిషాలు కాగా, తెలుగు, తమిళ వెర్షన్లు 2 గంటల 51 నిమిషాల నిడివితో వస్తున్నాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికెట్ కేటాయించింది.

editor

Related Articles