Movie Muzz

‘వృషభ’ ఫిల్మ్ మ్యూజిక్ ఆడియో జ‌ర్నీ ప్రారంభం.

‘వృషభ’ ఫిల్మ్ మ్యూజిక్ ఆడియో జ‌ర్నీ ప్రారంభం.

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృష‌భ‌’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్పా..’అనే సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ప‌విత్ర‌మైన, గొప్ప‌ అనుబంధాన్ని తెలియ‌జేసే ఈ పాట సినిమాకు ఆత్మ‌, వెన్నెముక లాంటిది. దీంతో సినిమా ప్ర‌మోష‌న్స్‌కు ఎమోష‌న‌ల్ స్టార్టింగ్ దొరికిన‌ట్ట‌య్యింది.   సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ను హిందీ, క‌న్న‌డ‌, తెలుగులో విజ‌య్ ప్ర‌కాష్.. మ‌లయాళంలో మ‌ధు బాల‌కృష్ణ‌న్ పాడ‌గా, సాహిత్యాన్ని మ‌ల‌యాళంలో వినాయక్ శ‌శికుమార్‌, తెలుగులో క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి త్రిపుర‌నేని, హిందీలో కార్తీక్ ఖుష్‌, క‌న్న‌డ‌లో నాగార్జున శ‌ర్మ అందించారు. ప్ర‌తి రైట‌ర్ త‌న పాట‌లో త‌మ సంస్కృతిని మిక్స్ చేసి ఎమోష‌న‌ల్ ట‌చ్ ఉండేలా చూసుకున్నారు.   వృష‌భ మూవీలోని పాట‌లు టి సిరీస్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి. ఈ సినిమా సంగీత ప్ర‌యాణం ముందుగా అప్పా పాట‌తో మొద‌లైంది. డిసెంబ‌ర్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతోన్న ఈ మూవీని నంద కిషోర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా థియేట‌ర్స్‌లో చూడాల‌నుకుంటున్న సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ మూవీస్‌లో వృష‌భ ఒక‌టి. అన్నీ మాధ్య‌మాల్లో వృష‌భ ఫ‌స్ట్ వీడియో సాంగ్ అప్ప‌.. హృద‌యాన్ని హ‌త్తుకునేలా తండ్రీ కొడుకుల బంధాన్ని తెలియ‌జేసే పాట‌, సినిమాకు ఆత్మ‌లాంటి పాట ఇది..

editor

Related Articles