తమిళనాడులోని కరూర్ పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రాజకీయ సభలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. తమిళగ వెట్రి కళగం అధినేత, హీరో విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మరణించిన వారిలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉండటం మరింత కలచివేసింది. దేశవ్యాప్తంగా విషాదం అలముకుంది. విజయ్ రాజకీయంగా అరంగేట్రం చేయడం, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతారన్న కారణంగా సభకు భారీగా జనాలు తరలివచ్చారు. ఈ ఘటనలో 95 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తుండగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విజయ్, సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పందించారు. మీ ముఖాలన్నీ నా మనసులో మెదులుతున్నాయి. నాపై చూపిన ప్రేమను తలచుకుంటే గుండె మరింత బరువెక్కుతోంది. మీ బాధ తీర్చలేనిది… కానీ మీ కుటుంబ సభ్యుడిగా నా వంతుగా సహాయం చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ఇస్తానని విజయ్ తెలియజేశారు.

- September 28, 2025
0
100
Less than a minute
You can share this post!
editor