టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. గత నాలుగు రోజులుగా వీరి నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా, వీరి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందని చెబుతున్నారు. ఈ వార్తల వేళ విజయ్ దేవరకొండ తాజాగా పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ట్రస్ట్ సభ్యులు విజయ్‌ను గౌరవంగా స్వాగతించారు. ఈ సందర్బంగా తీసిన ఫొటోల్లో విజయ్ చేతికి ఉన్న ఉంగరం స్పష్టంగా కనిపించడంతో అభిమానుల్లో ఉత్సుకత పెరిగింది. ఇది ఎంగేజ్‌మెంట్ రింగ్ అయి ఉండొచ్చునని అనేకమంది కామెంట్స్ పెడుతున్నారు.
గతంలో విజయ్ చేతికి రింగ్ కనిపించకపోవడం, ఇప్పుడు మాత్రం తన చేతికి కొత్త రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం వార్తలకు బలం చేకూరింది. అయితే దీనిపై విజయ్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు.
