సినీ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. విజయ్ దేవరకొండతో పాటు మేనేజర్ రవికాంత్, డ్రైవర్ అందె శ్రీకాంత్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి ఏపీలోని పుట్టపర్తికి కారులో బయలుదేరారు. సోమవారం ఉదయం తిరిగి వస్తుండగా గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజీ సమీపంలో హైవే – 44పై బొలెరో వాహనం ప్రమాదవశాత్తు విజయ్ కారు ఎడమ వైపు తగిలింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతింది. విజయ్‌తోపాటు మరో ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే కర్నూల్ నుండి మరో కారు తెప్పించిన విజయ్ హైదరాబాద్‌కు బయలుదేరారు. ఉండవల్లి పోలీసులు కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- October 7, 2025
0
10
Less than a minute
You can share this post!
editor