వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ. ఒకదాని తర్వాత ఒకటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్‌ని అందుకుంటూ కెరీర్ పరంగా ఆయన చాలా ఇబ్బందిపడ్డాడు. కానీ ‘కింగ్‌డమ్’తో ఆయన మొదటి నుండి ఆడియన్స్‌లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించేలా చేశాడు. టీజర్ బాగా ఆకట్టుకుంది, పాటలు కూడా బాగున్నాయి, థియేట్రికల్ ట్రైలర్ అయితే అదుర్స్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘రగిలే.. రగిలే’ పాట అయితే యూత్‌ని ఒక ఊపు ఊపేసింది. ఇలా ఇన్ని రకాల పాజిటివ్ వేవ్స్ నడుమ ఈ సినిమా విడుదలైంది. రెస్పాన్స్ ఊహించిన విధంగానే అద్భుతంగా ఉంది. ఓవర్సీస్ ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా అందరూ సినిమా క్వాలిటీని తెగ మెచ్చుకుంటున్నారు. ట్విట్టర్ నుండి వచ్చిన ఓవరాల్ ఓవర్సీస్ టాక్ ఎలా ఉందో వివరంగా చూద్దాం. ఫస్ట్ హాఫ్‌ని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తనదైన మార్క్‌తో చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు అనే ఫీలింగ్‌ని రప్పించాడు. విజయ్ దేవరకొండ నటన కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. అంటే ఇన్ని రోజులు చూసిన విజయ్ దేవరకొండ వేరు, ఈ సినిమాలో కనిపించిన విజయ్ దేవరకొండ వేరు. కాస్త ఆ డైలాగ్ డెలివరీని మార్చుకుంటే చాలు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ప్రారంభంలో 15 నిమిషాలు అదిరిపోయింది. ఆ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ తమ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాని క్లైమాక్స్ వరకు వేరే లెవెల్‌కి తీసుకెళ్లారు. ఇక చివర్లో పార్ట్ 2 కి ఇచ్చే లీడింగ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉందని ట్విట్టర్‌లో ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. ట్విట్టర్ ఓపెన్ చేసి కింగ్‌డమ్ అనే హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు పాజిటివ్ రివ్యూస్ తప్ప, నెగిటివ్ రివ్యూస్ ఎక్కడా కనిపించవు.

- July 31, 2025
0
61
Less than a minute
Tags:
You can share this post!
editor