విజ‌య్ దేవ‌ర‌కొండ ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్

విజ‌య్ దేవ‌ర‌కొండ ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్

సినీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవ‌ల‌ డెంగ్యూతో బాధపడి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆయన పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఆయనకు వైద్యం అందించిన ప్రైవేట్ ఆసుపత్రి వర్గాల నివేదిక ప్రకారం, విజయ్ త్వరితగతిన కోలుకుంటున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ టీమ్‌కు చెందిన సభ్యుడు ఒకరు ఇంగ్లీష్  మీడియాతో మాట్లాడుతూ, ప్రారంభంలో ఆయనకు జ్వరం మాత్రమే ఉండడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. కానీ పరీక్షలలో డెంగ్యూ వచ్చిందని నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స తీసుకుని తాజాగా డిశ్చార్జ్ అయ్యారు అని వివరించారు. గ‌త కొన్ని రోజులుగా నాగవంశీ ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నారు. కింగ్‌డమ్ సినిమా విడుదల ఇప్పటికే అనేక వాయిదాలు ఎదుర్కొంది. మొదట మే 30కి, ఆ తర్వాత జులై 4కి, చివరికి జూలై 31కి వాయిదా పడింది. మ‌రి ఈ సినిమాతో అయినా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మంచి విజయం ద‌క్కుతుందా లేదా అనేది వేచిచూడాలి.

editor

Related Articles