విజయ్‌ దేవరకొండ-డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌ కాంబినేషన్‌?

విజయ్‌ దేవరకొండ-డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌ కాంబినేషన్‌?

విజయ్‌ దేవరకొండను హీరోగా నిలబెట్టిన సినిమా ‘పెళ్లి చూపులు’. చిన్న సినిమా రూపురేఖలు మార్చివేసిన సినిమా అది. దర్శకుడిగా తరుణ్‌ భాస్కర్‌కి మంచి పేరు తీసుకురావడంతోపాటు ఉత్తమ మాటల రచయితగా జాతీయ అవార్డును కూడా అందుకున్న సినిమా. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ, తరుణ్‌భాస్కర్‌ ఇద్దరూ వారి వారి సినిమాలతో బిజీ అయిపోయారు. మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నట్టు ఫిల్మ్‌వర్గాల సమాచారం. ఇప్పటికే విజయ్‌కి తరుణ్‌భాస్కర్‌ కథ వినిపించాడట. విజయ్‌ కూడా ఓకే చెప్పాడట. ఇప్పటివరకూ చిన్న సినిమాలు చేసిన తరుణ్‌భాస్కర్‌ ఈ సినిమాతో పంథా మార్చి భారీ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌తోపాటు తరుణ్‌భాస్కర్‌ హ్యూమర్‌ కూడా కథలో ఉంటుందని వినికిడి. ఈ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ప్రస్తుతం చాలామంది నిర్మాతలు రెడీగా ఉన్నారు.

administrator

Related Articles