టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇక పెద్ద హీరోల మల్టీస్టారర్ సినిమా వస్తోందంటే ఆ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ మల్టీస్టారర్ గురించి టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హీరో బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వెంకటేష్ తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో వెల్లడించారు. తాను చేయబోయే సినిమాల జాబితాను వెంకీ ప్రకటించాడు. త్రివిక్రమ్‌తో ఓ సినిమా.. చిరు – అనిల్ సినిమాలో ఓ కేమియో రోల్.. మీనాతో కలిసి ‘దృశ్యం-3’.. అనిల్ రావిపూడితో మరో సినిమా.. ఆ తర్వాత బాలయ్యతో ఓ మల్టీస్టారర్ సినిమా ఉండబోతోందని వెంకీ అనౌన్స్ చేశారు. దీంతో వెంకటేష్ అభిమానులతో పాటు బాలయ్య అభిమానుల్లో కూడా ఈ మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తి నెలకొంది.

- July 7, 2025
0
122
Less than a minute
Tags:
You can share this post!
editor