దేశభక్తి మూడ్‌లో వరుణ్ ధావన్ – ‘బోర్డర్ 2’ ఫస్ట్ లుక్ సంచలనం!**గదర్ 2, జాట్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా బోర్డర్ 2. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించనుండగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి, సోనం బజ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి చిత్రబృందం వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో వరుణ్ ధావన్ హోషియర్ సింగ్ దాహియా పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఫస్ట్ లుక్‌లో వరుణ్ ధావన్ గన్ పట్టుకుని శత్రువులపై కాల్పులు జరుపుతున్న విధంగా కనిపిస్తూ యాక్షన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.
- November 5, 2025
0
42
Less than a minute
You can share this post!
editor

