‘ఉసురే’ ఆగస్ట్‌ 1న రిలీజ్…

‘ఉసురే’ ఆగస్ట్‌ 1న రిలీజ్…

టీజయ్‌ అరుణాసలం, జననీ కునశీలన్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘ఉసురే’. నవీన్‌ డి గోపాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మౌళి ఎం రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 1న విడుదల కానుంది. మాజీ హీరోయిన్ రాశి ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించారు. మంగళవారం సినిమా గీతాలను విడుదల చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించామని,  గ్రామీణ ప్రేమకథగా ఆకట్టుకుంటుందని, చిత్తూరులోని ఓ విలేజ్‌లో షూటింగ్‌ చేశామని దర్శకుడు నవీన్‌ డి గోపాల్‌ తెలిపారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్‌ ఇష్యూని ఇందులో చర్చించామని, హృదయానికి హత్తుకునే ప్రేమకథా సినిమా అని నిర్మాత అన్నారు. ఈ సినిమాకి సంగీతం: కిరణ్‌ జోజ్‌.

editor

Related Articles