పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్‌తో చేస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మేకర్స్ ఫైనల్‌గా ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ ఒక క్రేజీ క్లైమాక్స్ ఎపిసోడ్ పవన్‌పై తెరకెక్కించిన సన్నివేశాలతో కంప్లీట్ అయినట్టుగా ఇప్పుడు తెలిపారు. ఇక దీనిపై దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి సెట్స్‌లో ఉన్న పవన్ లుక్ అయితే అదిరింది. మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని కళ్లద్దాలు పెట్టుకొని పవన్ మంచి స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈ క్లైమాక్స్ పోర్షన్‌ని నబ కాంత మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కించినట్టుగా తెలిపారు. మరి ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాల్లో ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

- July 29, 2025
0
61
Less than a minute
Tags:
You can share this post!
editor