‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలై శ్రోతలను ఉర్రుతలూగిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించి, తక్షణ హిట్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉండి, సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే, పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్ సమకూర్చిన నృత్యరీతులు కూడా భారీ ప్రశంసలను అందుకుంటున్నాయి. ఇక ప్రేరణాత్మకమైన, వాణిజ్యపరమైన అంశాల కలయికలో భాస్కరభట్ల రాసిన సాహిత్యం పాట విజయంలో కీలక పాత్ర పోషించింది. ‘దేఖ్‌లేంగే సాలా’ పాట ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంగీతం విషయంలో ఆయనకు మంచి అభిరుచి ఉంది. హరీష్ శంకర్ గత చిత్రాలలోని పాటలు వింటే ఆ విషయం స్పష్టమవుతుంది.
- December 15, 2025
0
45
Less than a minute
You can share this post!
editor


