మ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమాపై అప్‌డేట్..

మ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమాపై అప్‌డేట్..

హీరో మ‌హేష్ బాబు- ద‌ర్శ‌క రాజ‌మౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా నుండి ఏ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చినా అది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షెడ్యూల్ పూర్తి కాగా తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. కొత్త షెడ్యూల్ ఈ నెల 9 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు ప‌లువురు న‌టీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. రాజమౌళి – మ‌హేష్ బాబు సినిమాలో కీలక రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్ నానా పాటేకర్‌ను తీసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల రాజ‌మౌళి పూణే వెళ్లి స్క్రిప్ట్ వివ‌రించ‌గా, ఆయ‌న పూర్తిగా విన్నార‌ట‌. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ.20 కోట్ల వరకూ ఇస్తామని చెప్పినప్పటికీ నానా పాటేకర్ ఈ ఆఫర్ తిరస్కరించారని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. త‌న పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే నానా పాటేక‌ర్ సినిమా నుండి త‌ప్పుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో సినిమా రిలీజ్ కానుంది.

editor

Related Articles