హిందూ మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో యానిమేటెడ్ సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సినిమా ‘మహావతార్ నరసింహ’. కన్నడ టాప్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నుండి వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. మహావతార్ నరసింహ – సినిమాను తెరకెక్కించి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను కాపాడటానికి చేస్తున్న కృషి అద్భుతం. ఈ సినిమా యువతలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి పెంచేందుకు ఒక మంచి ప్రయత్నమే అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా జులై 25న విడుదలైంది. హిందూ పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ యానిమేటెడ్ సినిమా విష్ణువు దశావతారాల గురించి ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో మొదటిది. ఈ సినిమాను అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశారు.

- August 14, 2025
0
70
Less than a minute
Tags:
You can share this post!
editor