త్రివిక్ర‌మ్ కొడుకు సహాయ దర్శకుడిగా ప్రభాస్ సినిమాకు..

త్రివిక్ర‌మ్ కొడుకు సహాయ దర్శకుడిగా ప్రభాస్ సినిమాకు..

తెలుగు సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, రచయితగా తన కెరీర్‌ను ప్రారంభించి, దర్శకుడిగా అద్భుత విజయాలు సాధించారు. ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్ లాంటి స్టార్ హీరోలు నటించ‌గా, వారి సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ  దర్శకుడి కొడుకు రుషి మనోజ్ సినీ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారన్న వార్తలు ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, తర్వాత హిందీలో ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబర్ నుండి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ కుమారుడు రుషి సహాయ దర్శకుడిగా చేస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. రుషి ఇప్పటికే నిశాచరుడు అనే షార్ట్ ఫిలిం తీసి, దానికి నటుడిగా, దర్శకుడిగా పనిచేశారు. అలాగే ‘స్టాగ్నేషన్’ అనే మరో షార్ట్ ఫిల్మ్‌కి ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. దర్శకత్వం పట్ల ఆయన ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభాస్ సినిమాకు దర్శకుడిగా కాని, రచయితగా కాని ఇప్పటివరకు పనిచేయలేదు. కానీ ఆయన కుమారుడు స్పిరిట్ సినిమాకి పనిచేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

editor

Related Articles