త్రిష పెళ్లి వార్త నిజమేనా..

త్రిష పెళ్లి వార్త నిజమేనా..

హీరోయిన్ త్రిష ఇటీవల పెళ్లి వార్త‌ల‌లో హాట్ టాపిక్ అయిన విష‌యం తెలిసిందే.. త‌న తోటి హీరోయిన్స్ అంద‌రూ పెళ్లి చేసుకుంటున్నా త్రిష మాత్రం సింగిల్‌గానే ఉంటూ సినీ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. నాలుగు ప‌దుల వ‌య‌సు దాటిన తర్వాత కూడా గ్లామర్‌తో అలరిస్తోంది. అయితే ఇటీవల చంఢీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష వివాహం ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. తల్లిదండ్రుల ఒప్పందంతో ఈ బంధం దాదాపు ఖరారయ్యిందని, త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారన్న రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై చివరికి త్రిష స్పందించాల్సి వచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్‌లో, ‘‘నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న వారిని నేనెప్పుడూ ప్రేమిస్తానండి. ఇప్పుడు నా హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా’’ అంటూ సెటైరిక్‌గా రియాక్ట్ అయ్యారు. దీనితో త్రిష పెళ్లి వార్తల్లో నిజం లేదన్నది స్పష్టమైంది.

editor

Related Articles