టాలీవుడ్, కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల త్రిష పెళ్లి గురించి మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కోలీవుడ్ సర్కిల్స్‌లో త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఆమె ఓకే చెప్పిందనే టాక్ నడుస్తోంది. త్రిష గతంలో బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియన్‌తో నిశ్చితార్దం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నిశ్చితార్దం పెళ్లివరకు దారి తీస్తుందని అనుకోగా, అనూహ్యంగా అది రద్దయింది. అప్పటి నుండి త్రిష తన కెరీర్‌పైనే దృష్టి సారించింది. మనసుకు నచ్చినవాడు దొరికితే తప్పక పెళ్లి చేసుకుంటాను అని త్రిష గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, త్రిష తల్లిదండ్రులు చండీఘర్‌కు చెందిన ఓ కుటుంబంతో సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది. ఆ యువకుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి బిజినెస్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల తన వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించాడని కూడా చెబుతున్నారు. రెండు కుటుంబాలు దగ్గరైన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని త్రిష కూడా ఈ సంబంధానికి ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై త్రిష నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- October 9, 2025
0
37
Less than a minute
You can share this post!
editor