మలయాళ చిత్రసీమలో విషాదం అలుముకుంది. ప్రముఖ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ (51) శుక్రవారం సాయంత్రం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. నవాస్ ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడ బసచేస్తుండగా, నిర్ణీత సమయానికి చెక్‌ఔట్ చేయకపోవడంతో హోటల్ సిబ్బంది అతని గదికి వెళ్లారు. అతన్ని అపస్మారక స్థితిలో చూసి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నవాస్ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. అతని గదిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని తెలిపారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి శనివారం కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆయన మంచి గాయకుడిగా కూడా పేరు సంపాదించారు. కళాభవన్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సంతాపం వ్యక్తం చేశారు. మలయాళ చిత్రసీమలో ఓ కీలక పాత్ర పోషించిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ప్రస్తుతం నవాస్ మృతదేహాన్ని చొట్టనిక్కరలోని SD టాటా ఆసుపత్రిలో ఉంచారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు అని ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు ప్రార్ధిస్తున్నారు.

- August 2, 2025
0
57
Less than a minute
Tags:
You can share this post!
editor