నాగార్జున కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా రాబోతున్న 100వ సినిమా ఎప్పుడు రాబోతోంది..? అంటూ ఇప్పటికే అభిమానులు, ఫాలోయర్లతోపాటు సినిమా లవర్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్కినేని నాగార్జున. ఇటీవలే కూలీ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా నాగార్జున నటనకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రేజీ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. తన ల్యాండ్ మార్క్ సినిమా వివరాలను నాగ్ స్వయంగా ప్రకటించాడు. జీ5 (ఛానల్ ఓటీటీ)లో జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు నాగార్జున చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఆకాశం ఫేం రా కార్తీక్ దర్శకత్వంలో తన వందో సినిమా చేస్తున్నట్టు ఈ షోలో చెప్పాడు నాగ్. అంతేకాదు గత 6 నుండి 7 నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని కూడా చెప్పాడు.
ఈ సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని అభిమానులకు తెలియజేశాడు. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఘనంగా లాంచ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5న నాగార్జున – ఆర్జీవి కాంబోలో వచ్చి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన శివ 4కె వెర్షన్ రిలీజ్ కానుంది. త్వరలోనే రీ-రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ లెక్కన ఓ వైపు బిగ్ బాస్ 9 షో, మరోవైపు 100వ సినిమాతో నాగార్జున ఫుల్ బిజీగా ఉండబోతున్నాడన్నమాట.
