‘హనుమాన్’తో భారీ విజయాన్ని అందుకున్న తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే .. మంచు మనోజ్ ఇందులో ప్రతినాయకుడిగా ధీటైన పాత్రలో కనిపించనున్నారు. శ్రియ, జయరామ్, జగపతిబాబు వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రోమో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. “వైబ్ ఉందిలే బేబీ… వైబ్ ఉందిలే… ఈ గ్లోబ్‌ను ఊపే వైబ్ ఉందిలే…” అంటూ సాగే పాట ఫుల్ ఎనర్జీతో, స్టైలిష్ విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. తేజ సజ్జా – రితికా జంటపై ఈ పాటను పోలంకి విజయ్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు. పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి తమ మ్యాజిక్‌ను చూపించారు. పాటను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించడంతో, ఈ సాంగ్‌కు పాన్ ఇండియా వైబ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ పాట నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మిరాయ్ సినిమాతో తేజ సజ్జా మరోసారి సూపర్ హీరో ఫీల్ కలిగించే కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గ్లోబల్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్‌కి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వైవిధ్యమైన కాస్సెప్ట్‌లతో ప్రేక్షకులని అలరిస్తున్న తేజ సజ్జా ఈ సినిమాతోను మంచి హిట్ కొడతాడని అంటున్నారు.

- July 26, 2025
0
76
Less than a minute
Tags:
You can share this post!
editor