‘పంచాయత్ సీజ‌న్‌ 4’ ట్రైలర్ వచ్చేసింది

‘పంచాయత్ సీజ‌న్‌ 4’ ట్రైలర్ వచ్చేసింది

ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన పాపుల‌ర్‌ వెబ్ సిరీస్ పంచాయత్ తాజాగా నాలుగో సీజ‌న్ రాబోతోంది. ఇప్ప‌టికే మూడు సీజ‌న్‌లు రాగా సూప‌ర్ హిట్ అందుకున్నాయి. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ నుండి నాలుగో సీజ‌న్ రాబోతోంది. జూన్ 24 నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండ‌గా.. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ట్రైల‌ర్ చూస్తుంటే.. ఈసారి ఫులేరా గ్రామంలో ఎన్నికల కోలాహలం మొదలైన‌ట్లు తెలుస్తోంది. ప్రధాన్ జీ (రఘుబీర్ యాదవ్), భూషణ్ (దుర్గేష్ కుమార్) మధ్య తీవ్రమైన పోటీ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్‌లో ఎన్నికల ప్రచారం, రాజకీయ వ్యూహాలు, ఊహించని మలుపులు హైలెట్ అయ్యాయి. ప్రధాన్ జీ, భూషణ్ తమ మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. గత సీజన్లలో అలరించిన జితేంద్ర కుమార్ (అభిషేక్), నీనా గుప్తా (మంజు దేవి), ఫైసల్ మాలిక్, చందన్ రాయ్ ఈ సీజన్‌లోనూ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు.

editor

Related Articles