కన్నడ బ్యూటీ రష్మిక ఇటీవలి కాలంలో ఆమె చేసిన ప్రతి సినిమా 1,000 కోట్లు కలెక్ట్ చేసి ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చేసింది. అయితే.. ఆ మూడు సినిమాల్లోనూ ఆమె భార్య పాత్ర పోషించడం విశేషం. ఈ రికార్డ్ రష్మికకే సొంతం కాగా, ఈ విషయంలో నాగార్జున కూడా రష్మికపై ప్రశంసలు కురిపించాడు. గత మూడేళ్లలో మా స్టార్ హీరోల్లో ఎవరూ 2,000, 3,000 కోట్లు గడించలేదు. కానీ రష్మిక ఆ అరుదైన రికార్డ్‌ను దక్కించుకుంది అంటూ కుబేర సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నాగార్జున ఇచ్చిన ఎలివేషన్‌కి రష్మిక స్టేజ్ మీద ఉబ్బితబ్బిబ్బయింది. ప్రస్తుతం రష్మిక కుబేర సినిమా చేస్తున్నారు. కింగ్ నాగ్, ధనుష్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతుండగా, సినిమాని జూన్ 20 న విడుదల చేయనున్నారు. ఇటీవల కుబేర టీం చెన్నైలో ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. ఆ ఈవెంట్‌లో తాను చాలా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేసింది రష్మిక. తన చిన్నతనాన్ని గడిపిన చెన్నైలో ఈ ఈవెంట్ జరగడం ఒకెత్తైతే.. ఈ ఈవెంట్లో కింగ్ నాగ్, ధనుష్‌తో క్యాండిడ్ మూమెంట్స్‌ను పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. అలానే కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. అయితే ఓ పిక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ పిక్ స్పెషాలిటీ ఏంటంటే.. కింగ్ నాగార్జున రష్మికకి ఏదో చెబుతుంటే… ఆయన కాళ్ల దగ్గర కూర్చుని రష్మిక వింటోంది. ఇంత ఎదిగిన కూడా రష్మిక సింప్లిసిటీ.. పెద్దలకు గౌరవించడం చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
- June 12, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor

