నాగార్జున సర్ బిగ్ బాస్‌కి ఎంపిక చేయండి అంటున్న పెద్దావిడ..

నాగార్జున సర్ బిగ్ బాస్‌కి ఎంపిక చేయండి అంటున్న పెద్దావిడ..

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం షేర్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా ఎనిమిది సీజ‌న్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు తొమ్మిదో సీజ‌న్‌కి సిద్ధమైంది. ఈ సీజ‌న్‌కి కూడా అక్కినేని నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అయితే ఇటీవ‌ల ఈ షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో “ఇది చదరంగం కాదు… రణరంగం” అంటూ చెప్పడం బిగ్ బాస్ 9పై ఆసక్తిని మరింత పెంచింది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ అంటే సెలబ్రిటీల షో అన్న టాక్‌ ఉంది. యాక్టర్స్, యాంకర్స్, యూట్యూబ్‌ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లే ఈ షోలో ఎక్కువగా పాల్గొంటారు. అయితే కొన్ని సీజన్లలో సామాన్యులకు అవకాశం ఇచ్చినా, అవి అంతగా వర్కవుట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం కామన్ పీపుల్‌కి బంపరాఫర్ ఇచ్చింది బిగ్‌బాస్ టీం. ఈ అవకాశాన్ని వినియోగించుకోడానికి ఇప్పటికే చాలామంది సామాన్యులు అప్లై చేసుకున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ, తమను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపాలని కోరుతున్నారు. ఇటీవల ఓ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘నాగార్జున గారు… నన్ను బిగ్ బాస్ హౌస్‌కి ఎంపిక చేయండి. మీకు అద్భుతమైన టీ, కాఫీ పెట్టి ఇస్తా. చక్కగా రోటి, పచ్చళ్ళు చేసి పెడతా. ఒక్క అవకాశం ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటాను’’ అంటూ ఆమె చేసిన అభ్యర్థన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.

editor

Related Articles