కోలీవుడ్ ఇండ‌స్ట్రీ ఒక స్టంట్ మాస్ట‌ర్‌ను కోల్పోయింది..

కోలీవుడ్ ఇండ‌స్ట్రీ ఒక స్టంట్ మాస్ట‌ర్‌ను కోల్పోయింది..

తమిళ సినిమా పరిశ్రమలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆర్య హీరోగా, పా  రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి స్టంట్స్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న రాజు, రీసెంట్‌గా జ‌రిగిన షెడ్యూల్‌లో కార్ స్టంట్ చేస్తుండ‌గా, ఊహించ‌ని ప్ర‌మాదంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు రాజుకు సంతాపం తెలియజేస్తున్నారు. హీరో విశాల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో స్పందించారు. ఈ ఘటన గురించి విన్న వెంటనే షాక్‌కు గురయ్యాను. స్టంట్ మాస్టర్ రాజు ఇకలేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా ధైర్యంగా, రిస్క్‌ తీసుకుని పనిచేసే వ్యక్తి రాజు. నా సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా పని చేశాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో రాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వారి కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తానని హామీ ఇస్తున్నాను అని విశ్వాల్ ట్వీట్ చేశారు. విశాల్‌తో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన చేసిన స్టంట్లు ప్రేక్షకుల మెప్పు పొందాయి.

editor

Related Articles