మన టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున హీరోగా నటించిన సినిమాల్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ హిట్ సినిమా ‘చంద్రలేఖ’ కూడా ఒకటి. మరి ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్‌లు నటించారు. అయితే వీరిలో ఇషా చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు సీన్ పండడం కోసం నాగార్జునతో తాను 15 సార్లు చెంపదెబ్బలు తిన్నట్టుగా తెలిపారు. అయితే దీని వెనుక ఉన్న కథ ఏంటంటే ఈ సినిమాలో నాగార్జున ఆమెని కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సినిమా అప్పటికి ఆమె కెరియర్‌లో రెండో సినిమానే, సో ఆ సీన్‌లో తనకి ఎలాంటి ఫీల్ కలగడం లేదని భావించింది, అందుకే నిజంగా కొట్టమని తానే నాగ్‌ని కోరినట్టు చెప్పారు. అందుకు నాగ్ నిజంగానే కొట్టాలా అని అడిగారు.. నేను నిజంగానే అని చెప్పాను కానీ మొదట సాఫ్ట్ గానే కొట్టారు దాంతో నాలో ఫీల్ కలగకపోవడంతో నిజంగా చెంపదెబ్బలు 15 సార్లు తినాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. అయితే ఈ టేక్స్ తర్వాత నాగార్జున ఆమెకి సారీ కూడా చెప్పారని ఆమె తెలిపింది. అయితే అన్నిసార్లు దెబ్బలు తిన్నాక ఆమె బుగ్గలపై చేతివేళ్ల ముద్రలు పడ్డాయట. ఏది ఏమైనప్పటికీ ఈ షాకింగ్ అంశం ఇపుడు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

- July 30, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor