సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పర్చుకున్న హీరోయిన్ శ్రుతిహాసన్. తనకు నచ్చిన పాత్రలను చేస్తూ దూసుకెళ్తోంది ఈ హీరోయిన్. అయితే, ఆమె రీసెంట్‌గా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. దీంతో శ్రుతి క్రేజ్ మరోసారి జోరందుకుంది. శ్రుతిహాసన్ ఇప్పుడు రజినీకాంత్‌తో నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతిహాసన్ తన డ్రీమ్ రోల్ ఏమిటనేది వెల్లడించింది. తాను ఎప్పటికైనా ఓ మ్యూజిషియన్ పాత్రలో నటించాలనేది తన కోరిక అని ఆమె చెప్పుకొచ్చింది. సంగీతం కోసం పరితపించే దర్శకురాలిగా స్క్రీన్‌పై తనను తాను చూసుకోవాలని ఎప్పటినుండో కోరిక ఉందని ఆమె చెప్పుకొచ్చింది. మరి శ్రుతి కోరిక ఎప్పటికి నెరవేరుతుందో వేచి చూడాలి.

- July 29, 2025
0
102
Less than a minute
Tags:
You can share this post!
editor