2022 తర్వాత నిధి నటించిన తొలి తెలుగు సినిమా హరిహర వీరమల్లు సినిమా కావడం విశేషం. ఈ సినిమాను ఎఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించగా, క్రిష్ జాగర్లమూడి & జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. జులై 24న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం ఐదేళ్లు వేచి చూసింది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేయడానికి ఆమె భరతనాట్యం, గుర్రపు స్వారీ వంటి ప్రత్యేక శిక్షణలు తీసుకుంది. సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశం భరతనాట్య నేపథ్యంతో ఉంటుందని, అలాగే తన పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉందని నిధి వెల్లడించింది. మాస్ హీరోయిన్ కావాలని ఉంది కానీ నా హద్దులు నాకు తెలుసు అంటూ నిధి ఓ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ, తనకు మాస్ హీరోయిన్‌గా గుర్తింపు రావాలని ఉందని చెప్పింది. నేను తల్లిదండ్రులతో కలిసి చూడలేని సన్నివేశాల్లో నటించను. అలాంటి సన్నివేశాలు చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వొచ్చు. కష్టపడి పనిచేస్తాను, మంచి కథలు ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను అని పేర్కొంది. నిధి అగర్వాల్ ‘హరిహర వీరమల్లు’ కోసం ఎంతగా కష్టపడిందో సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా ద్వారా ఆమె నటనకు, డెడికేషన్‌కి మరోసారి మంచి గుర్తింపు రానుంది అనే ఆశ అభిమానుల్లో ఉంది.

- July 21, 2025
0
53
Less than a minute
Tags:
You can share this post!
editor