పోలీస్ కస్టడీలో ఉన్న హీరోయిన్..

పోలీస్ కస్టడీలో ఉన్న హీరోయిన్..

 కోలీవుడ్‌లో తరచూ వివాదాలకు కేంద్రబిందువైన నటి మీరా మిథున్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మూడేళ్లుగా పరారీలో ఉన్న ఆమెపై చెన్నై కోర్టు తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. వెంటనే అరెస్ట్ చేసి ఈ నెల 11వ తేదీన కోర్టులో హాజరు పరచాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా న‌టి మీరా మిథున్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా ప‌రారీలో ఉన్న ఆమెను ప్ర‌స్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఉన్న మీరా మిథున్‌ను ర‌క్షించి అప్ప‌గించాలంటూ ఆమె త‌ల్లి దాఖ‌లు చేసిన పిటిష‌న్ సోమ‌వారం కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది, దాంతో చెన్నై లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీ ద్వారా ఢిల్లీలో ఉన్న లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీకి ఇచ్చి, ఢిల్లీ పోలీసుల సాయంతో ఆమెను గుర్తించి అక్క‌డున్న ప్ర‌భుత్వ హోంలో ఉంచిన‌ట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. కాగా, 2021 ఆగస్ట్‌లో మీరా మిథున్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో తీవ్ర దుమారాన్ని రేపింది. అందులో ఆమె ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తులపై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు దర్శకులు తన ఫొటోను అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ, కోలీవుడ్ నుండి షెడ్యూల్డ్ కులాల వారిని తొలగించాలంటూ ఆమె చెప్పిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా మారాయి.

editor

Related Articles