సూపర్ స్టార్ మహేష్‌బాబు మరదలు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కారుని ఒక బస్సు ఢీకొట్టింది. దీంతో ఈ సంఘటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బస్సు రవాణా సంస్థపై తీవ్ర విమర్శలు గుప్పించింది. శిల్పా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ సంఘటనపై పోస్ట్ చేస్తూ.. ఈ రోజు నా కారును సిటీ ఫ్లో కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనకి సంబంధించి సంస్థకు చెందిన యోగేష్ కదమ్, విలాస్ మంకోటే అనే ప్రతినిధులను సంప్రదించగా.. అది తమ కంపెనీ బాధ్యత కాదని, డ్రైవర్‌దే పూర్తి బాధ్యత అని వెల్లడించారు. వీళ్లు తమ కంపెనీ ఉద్యోగుల పట్ల ఎంత కఠినంగా ఉన్నారు. ఒక డ్రైవర్ నెలకు ఎంత సంపాదిస్తాడు? అతడు ఈ డ్యామేజ్‌ని ఎలా కడతాడు అంటూ శిల్పా శిరోద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి దయవల్ల నా సిబ్బందికి ఏం కాలేదు. ఈ ఘటనపై కంప్లయింట్ తీసుకోవడానికి సహకరించిన ముంబై పోలీసులకు ధన్యవాదాలు. కానీ కంపెనీ మాత్రం ఎలాంటి బాధ్యతను తీసుకోదట అని శిల్పా రాసుకొచ్చింది.
- August 14, 2025
0
111
Less than a minute
Tags:
You can share this post!
editor


