సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పుష్ప. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో బన్నీ నటనకి ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇక పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్‌గా పుష్ప2 తీశారు సుకుమార్.ఈ సినిమా భారీ విజయం సాధించింది. పుష్ప 2: ది రూల్ గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై మంచి హిట్ టాక్‌తో బొమ్మ అదిరిపోయింది. పుష్ప సినిమా విడుదలై చాలా రోజులే అవుతున్నా ఆ ఫీవర్ ఇంకా ప్రజల్లో తగ్గడం లేదు. ఎక్కడో ఒకచోట మనకు పుష్ప హంగామా కనిపిస్తూనే ఉంటోంది. తాజాగా బీహార్‌లో కొందరు కుర్రాళ్లు అల్లు అర్జున్ తరహాలో తగ్గేదేలే అంటూ రోడ్లపైన తెగ హంగామా చేశారు. మ్యూజిక్ పెట్టుకొని అందరూ కూడా పుష్ప స్టైల్‌లో రచ్చ చేస్తుంటే చుట్టు పక్కలవారు వారిని అదేవిధంగా చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోపై బన్నీ అభిమానులు అయితే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ అంటే ఇలానే ఉంటది మరి అని ఫ్యాన్స్ అంటున్నారు.

- August 10, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor