పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ సినిమా ఓజీ ఈవెంట్‌లో ఓ నటిని ఆడ సివంగి అని పిలిచారు. ఆమె మామూలు నటి కాదు. పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కు పెట్టింది పేరు. 41 ఏళ్ల వయసులో హాట్ ఫోజులతో అదరగొడుతోంది. సలార్ లోనూ అదరగొట్టిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది. ఈమె ఎవరో తెలుసుకోండి. ఆమెనే శ్రియారెడ్డి. 41 ఏళ్ల వయసులోనూ ఇలా హాట్ ఫోజులతో హీట్ పెంచేస్తోంది శ్రియారెడ్డి. బ్యాక్‌గ్రౌండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. చెన్నైలో తెలుగు ఫ్యామిలీలో పుట్టింది శ్రియా. తండ్రి భరత్ రెడ్డి మాజీ టీమిండియా క్రికెటర్. ఎస్ఎస్ మ్యూజిక్‌లో వీజేగా ఆమె జర్నీ మొదలయ్యింది. విక్రమ్ హీరోగా వచ్చిన సమురాయ్ సినిమాతో తెరంగేట్రం చేసింది శ్రియా. తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో అడుగుపెట్టింది. తర్వాత అమ్మ చెప్పిందిలో నటించింది. సలార్‌లో యాక్టింగ్‌తో అదరగొట్టింది. తమిళ స్టార్ హీరో విశాల్ బ్రదర్‌ను శ్రియా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓజీతో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో శ్రియా యాక్టింగ్‌కు పవన్ ఫిదా అయ్యాడు. ఆమె ఫిట్ నెస్ వేరే లెవల్. ఆడ సివంగి. భవిష్యత్‌లో ఆమెతో కలిసి మంచి సినిమా చేస్తా అని పేర్కొన్నారు.

- September 23, 2025
0
1
Less than a minute
Tags:
You can share this post!
editor