సినీనటి కల్పిక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పుకోవాలి. ఇటీవల నగరంలోని ఓ పబ్‌లో సిబ్బందితో గొడవకు దిగి నానా హంగామా చేసిన ఈ నటి మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కింది. మొన్న గచ్చిబౌలి, నేడు మొయినాబాద్ రిసార్టులో నానా హంగామా, సిగరెట్లు తీసుకురమ్మని రిసెప్షనిస్టుపై భౌతికదాడి. వివరాలోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం క్యాబ్‌లో సింగిల్‌గా కనకమామిడిలోని బ్రౌన్‌టౌన్ రిసార్టుకు వచ్చిన కల్పిక.. రిసార్ట్‌లో రూమ్ తీసుకున్న కొద్ది పేపటికే.. క్యాబ్ సౌకర్యం సరిగ్గా లేదు… వైఫై సరిగ్గా రావడం లేదని రిసార్టు సిబ్బందితో వాదనకు దిగింది. అనంతరం రిసార్టు రిసెప్షన్‌లో ఉన్న మేనేజర్ కృష్ణ వద్దకు వెళ్లి తనకు సిగరెట్ కావాలని.. తీసుకొచ్చి ఇవ్వమని అడిగింది. రిసార్టులో మేము సిగరెట్ కాని, మందు కానీ సప్లై చేయమని, ఒకవేళ మీకు కావాలంటే మీరే తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన కల్పిక మేనేజర్ కృష్ణతో దురుసుగా ప్రవర్తించింది. ఫుడ్ మెనూ కార్డు, రూమ్ కీస్, రిసెప్షన్‌లో ఉన్న రిజిస్టర్లు కృష్ణ మోహం మీద విసిరేసి బూతులు తిట్టింది. అక్కడి సిబ్బందిపై దుర్భాషలాడి రిసార్టు నుండి వెళ్లిపోయింది. దాదాపు 40 నిమిషాల పాటు రిసార్టులో నానా హంగామా చేసింది. కాగా నటి వ్యవహారంపై రిసార్టు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేద్దామా వద్దా అనే డైలమాలో పడ్డారు.

- July 30, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor