ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 9 ప్రకటించిన నాటి నుండి హైప్ ఊపందుకుంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇది షోపై అమితాసక్తిని కలిగించింది. ఇప్పటివరకూ సెలబ్రిటీలకే హౌస్‌లోకి ప్రవేశం లభించగా, ఈ సీజన్‌లో మాత్రం నిర్వాహకులు కొత్త ప్రయోగానికి దిగారు. సామాన్యులకు కూడా హౌస్‌లోకి ఎంపిక చేసే ఛాన్స్ కల్పించారు. దీంతో యువత నుండి విశేష స్పందన వస్తోంది. వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించి, “బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు?” అనే అంశంపై వీడియోలు కోరారు. దీనికి భారీ స్పందన వచ్చింది. వేలాది అప్లికేషన్లలో తొలిదశకు 200 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్స్‌ప్రెషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా 100 మందిని షార్ట్‌లిస్ట్‌గా చేశారు. చివరకు వీరిలో నుంచి 40 మందిని ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేశారు. వీరిలో మూడు లేక నలుగురికే అవకాశం కల్పిస్తారు, వారిని ‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. సామాన్యుల ఎంపిక ఈ నెలలోనే పూర్తిచేయాలని షో టీం భావిస్తోంది. సెప్టెంబర్ 7న సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. షో ‘స్టార్ మా’లో టెలికాస్ట్ అవుతుండగా, జియో హాట్ స్టార్లో – డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారు. ఈ సీజన్‌లో పాపులర్ బుల్లితెర యాక్టర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఫోక్ సింగర్స్, ఓటీటీ స్టార్స్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. ఇప్పటివరకు వినిపిస్తున్న జాబితాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ ఐశ్వర్య, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, సీరియల్ యాక్టర్లు సాయికిరణ్, దేబ్జానీ, కావ్యశ్రీ, కన్నడ నటి కావ్యా శెట్టి, అలేఖ్య చిట్టి, పికెల్స్ ఫేం రమ్య, కల్పికా గణేష్, సుమంత్ అశ్విన్, ఆర్జే రాజ్, శ్రావణి వర్మ, తేజస్విని గౌడ, దీపికా, వర్ష, పరమేశ్వర్ హివ్రాలే, తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గా దత్తా, ఫోక్ సింగర్ లక్ష్మి వంటి వారు హౌస్‌లోకి ప్రవేశించనున్నారని టాక్. ఇవన్నీ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు మాత్రమే. అధికారిక లిస్టు త్వరలోనే విడుదల చేస్తారు.

- July 26, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor