సువిక్షిత్, గీతిక రతన్ జంటగా నటిస్తున్న సినిమా ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు బి.సాయిప్రతాప్‌రెడ్డి, జయశంకర్ రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా నుండి ‘అప్పన్న తన మన’ అనే లిరికల్ వీడియోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హీరో సువిక్షిత్ గొప్ప పాషన్‌తో నటించారని మెచ్చుకున్నారు. 1990 నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇదని, ప్రతి ఒక్కరిని ఆ కాలంలోకి తీసుకెళ్తుందని, బ్యాక్‌డ్రాప్‌కు తగిన లొకేషన్లలోకెళ్లి సహజంగా చిత్రీకరించామని, తన అభిమాన దర్శకుడు సుకుమార్ ఈ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందని హీరో సువిక్షిత్ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: ఆనంద్ గుర్రాన.

- April 19, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor